Janaki Mahal Ayodhya: అయోధ్యలో సీతమ్మ తల్లి ప్యాలెస్‌

అల్లుడుగారికి మర్యాదలు అక్కడే;

Update: 2024-01-12 00:15 GMT

 శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో చూడదగ్గ చారిత్రక ప్రదేశాలు చాలాఉన్నాయి. రామమందిరానికి ఈశాన్య దిశలో సీతమ్మ తల్లి ప్రైవేటు ప్యాలెస్‌ ఉంది. దశరథుని భార్య రాణి కైకేయి వివాహానంతరం అయోధ్యకు వచ్చిన తన కోడలు జానకికి ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చిందని చెబుతారు. శ్రీ కృష్ణుడు కనక భవనాన్ని పునరుద్ధరణ చేసినట్లు ఇక్కడ నమ్ముతారు. ప్రస్తుతం ఓర్చా వంశస్థులు ప్యాలెస్‌ను నిర్వహిస్తున్నారు.

అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాల్లో కనక భవనం ఒకటి. సీతారాముల వనవాసానికి కారణమైన కైకేయే స్వయంగా ఈ ప్యాలెస్‌ను వివాహానంతరం కోడలు జానకికి కానుకగా ఇచ్చినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఈ ప్యాలెస్‌లో సీతారాముల విగ్రహాలున్నాయి. ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలతో కూడిన ఈ ప్యాలెస్ నిర్మాణ శైలి బుందేల్‌ఖండ్ రాజభవనాలను పోలి ఉంటుంది. ఈ ప్యాలెస్‌ను అనేక సార్లు పునరుద్ధరించినట్లు చెబుతారు. ముందుగా రాముడి పుత్రుడు కుశుడు, ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు, తర్వాత విక్రమాదిత్యుడు,కనక భవన్‌ను పునర్నిర్మించినట్లు చెప్తారు.

నవాబ్ రెండో సాలార్జంగ్ హయాంలో కనక భవనం ధ్వంసమైందనీ, బుందేల్‌ఖండ్‌ మహారాజు ప్రతాప్ సింగ్ అతని భార్య వృషభన్ కున్వారీ 1891లో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు నమ్ముతున్నారు. ఆ రాణి ప్రతిష్ఠించిన విగ్రహాలే ప్రస్తుతం ప్యాలెస్‌లో ఉన్నాయని కథలు ప్రచారంలో ఉన్నాయి.ఈ కనక భవనం గోడలపై చెవి పెట్టి శ్రద్ధగా వింటే.. సీతమ్మ కాలిగజ్జల శబ్ధం వినిపిస్తుందని ఇక్కడి రామానందాచార్య రామ్దినేశాచార్య చెప్పారు. నేటికీ.. రాముడు సీతతో కలిసి ఇక్కడే ఉన్న దివ్యమైన అనుభూతి కలుగుతుందని వెల్లడించారు

Tags:    

Similar News