J&K: సైనికులే లక్ష్యంగా బ్రిడ్జి కింద బాంబు...

నిర్వీర్యం చేసిన భద్రత బలగాలు... భారీ ఉగ్ర కుట్ర భగ్నం..;

Update: 2023-08-01 04:45 GMT

జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రదాడిని భద్రతా దళాలు భగ్నం చేశాయి. శ్రీనగర్‌-బారాముల్లా జాతీయ రహదారిపై జంగం ఫ్లైవర్‌(Zangam flyover) వద్ద పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేసి, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం(destroyed ) చేశారు.ఈ మార్గంలో నిత్యం భద్రతాల దళాల కాన్వాయ్‌లు తెల్లవారుజామున( Army patrol party) ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు భావిస్తున్నారు.


తొలుత ఇక్కడ అనుమానాస్పద వస్తువును గుర్తించడంతో వెంటనే సీఆర్‌పీఎఫ్‌(CRPF) దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ వస్తువును ఐఈడీ(IED)గా అనుమానించి జమ్మూకశ్మీర్‌ పోలీసుల( jk police)కు సమాచారం అందించారు. వీరితోపాటు సైన్యానికి చెందిన 29వ రాష్ట్రీయ రైఫిల్స్‌ బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. అనంతరం బాంబు స్క్వాడ్‌( bomb disposal squad) దానిని సురక్షితమైన ప్రదేశానికి తరలించింది. తర్వాత నియంత్రిత విధానంలో ధ్వంసం చేసింది

Tags:    

Similar News