KA Paul: మోదీ, అమిత్‌షాలతో కేఏ పాల్.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ..
KA Paul: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్‌షాలకు వివరించానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.;
KA Paul: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వివరించానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని వారు చెప్పారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన సహకారాన్ని కోరారన్నారు. మమతా బెనర్జీ విపక్షాలను ఏకం చేస్తున్నారని.. అయితే.. ప్రతిపక్షం ఐక్యంగా లేదన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్ధి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తారని కేఏ పాల్ అన్నారు. తాను రాష్ట్రపతి అభ్యర్ధిని కాదన్నారు. ఒక మంచి న్యూట్రల్ క్యాండిడేట్‌ను ప్రపోజ్ చేశానని చెప్పారు.