Kamal Haasan Controversy : కమల్ హాసన్.. ఓ మానసిక రోగి... కన్నడ కాంగ్రెస్, బీజేపీ ఫైర్

Update: 2025-05-29 08:30 GMT

కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టిందంటూ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఓ సినిమా ఫంక్షన్ చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో పెనుదుమారానికి దారి తీశాయి. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతృత్వంలోని విపక్షాలు ఏకమై కమల్ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించాయి. వివాదంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కన్నడ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్, అతడికి ఆ సంగతి తెలియదు అని అన్నారు. బీజేపీ నేత, అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోక మాట్లాడుతూ కమల్ హాసన్ అదేపనిగా కన్నడ భాషను, కర్నాటకను అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. కర్నాటకలో కమల్ హాసన్ నటించిన అన్ని సినిమాలను బాయికాట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. లేనిపక్షంలో ఆయన ఒక మానసిక రోగిలా నటిస్తూనే ఉంటారు అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News