Kangana Ranaut : కంగనాను అందుకే కొట్టా... కుల్విందర్ కౌర్ వ్యాఖ్యలు వైరల్

Update: 2024-06-07 08:55 GMT

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి దాడి చేయడం సంచలం రేపింది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో అధికారి కుల్విందర్ కౌర్.. కంగనా చెంపపై కొట్టారు. సెక్యూరిటీ చెక్ ముగించుకుని తాను బోర్డింగ్ పాయింటికి వెళ్తున్న సమయంలో మహిళా అధికారి తన మొహంపై కొట్టిందని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే తనను దూషించిందని కంగనా రనౌత్ వీడియో రిలీజ్ చేసింది.

తాను క్షేమంగా ఉన్నానని కానీ పంజాబ్లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం గురించి ఆందోళనతో ఉన్నానని ఆమె అన్నారు. ఈ ఇన్సిడెంట్ వైరల్ కావడంతో సదరు అధికారిని సస్పెండ్ చేశారు. రైతులు ఆందోళన సందర్భంగా పంజాబ్ మహిళ గురించి కంగనా చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆమెను కొట్టానని ఆ అధికారిణి చెప్పినట్లు సమచారం.

రైతు ఉద్యమంలో పాల్గొన్న వారు రూ. 100 తీసుకుని వచ్చారని కంగనా చేసిన వ్యాఖ్యలపై, 2020-2021 నిరసనల సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో క్యాంప్ చేస్తున్న రైతుల్లో తన తల్లి ఒకరని ఆ మహిళా అధికారిణి చెప్పింది. రైతులు రూ. 100 కోసం అక్కడ కూర్చున్నట్లు ఆమె ప్రకనట ఇవ్వడంతో తనకు కోపం వచ్చిందని.. కుల్విందర్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News