Karnataka: విఐపిల కోసం ప్రత్యేక విమానాలు, ప్రైవేట్ జెట్లు .. బిజెపి విమర్శనాస్త్రాలు

అభివృద్ధికి డబ్బు లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విలాసాలకు ఎలా ఖర్చుపెడుతోంది అని అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ని ప్రతిపక్ష పార్టీ బిజెపి విమర్శిస్తోంది.

Update: 2025-09-03 06:41 GMT

విఐపిల ప్రయాణం కోసం కర్ణాటక ప్రభుత్వం హెలికాప్టర్ మరియు ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయాలనే నిర్ణయం పెద్ద దుమారానికి దారితీసింది, అభివృద్ధికి డబ్బు లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విలాసాలపై ఖర్చుపెడుతోందని ప్రతిపక్ష బిజెపి ఆరోపించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం VIP ప్రయాణం కోసం హెలికాప్టర్లు మరియు ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఈ చర్య చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అన్నారు. "ప్రభుత్వం త్వరలో దీని కోసం టెండర్ పిలుస్తుంది. హెలికాప్టర్ మరియు ప్రత్యేక విమానం కొనుగోలు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి నాకు మరియు కొంతమంది మంత్రులకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు ఏమి చేస్తున్నాయో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాము. మేము HAL (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) తో కూడా చర్చించబోతున్నాము." అని మీడియాకు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మంత్రులు కెజె జార్జ్, బైరతి సురేష్ లను కలిసి ఈ విషయంపై చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం విమానాలను కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని బిజెపి తప్పుపట్టింది. "అభివృద్ధి ప్రాజెక్టులకు డబ్బు లేదు, కొత్త పథకాలను రూపొందించడానికి నిధులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించటం లేదు, అత్యవసర పరిస్థితుల్లో జీవన్మరణ పరిస్థితులతో పోరాడుతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సకాలంలో చేరడం లేదు, స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్లు కూడా అందించడం లేదు. ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు '5 సీట్ల హెలికాప్టర్ మరియు 13 సీట్ల జెట్' కొనుగోలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఆమోదయోగ్యం కానిది అని అన్నారు."

ఇది ఎలా ఉందంటే  "తినడానికి తిండి లేదు కానీ జుట్టుకి మాత్రం సంపెంగ నూనె కావాలి" అనే సామెతను గుర్తు చేస్తుంది అని రాష్ట్ర బిజెపి చీఫ్ విజయేంద్ర యడ్యూరప్ప అన్నారు.

Tags:    

Similar News