Karnataka: అన్నభాగ్య పథకానికి బియ్యం కొరత
కర్నాటక సర్కార్ ప్రతిష్టాత్మక చేపట్టిన అన్నభాగ్య పథకానికి బియ్యం కొరత ఏర్పడింది. జులై 1 నుంచి ప్రారంభించాలన్న అన్నభాగ్య పథకానికి కేంద్రం రాజకీయ కుట్ర కారణంగా అడ్డుకట్ట పడుతోందన్నారు సీఎం సిద్దరామయ్య;
కర్నాటక సర్కార్ ప్రతిష్టాత్మక చేపట్టిన అన్నభాగ్య పథకానికి బియ్యం కొరత ఏర్పడింది. జులై 1 నుంచి ప్రారంభించాలన్న అన్నభాగ్య పథకానికి కేంద్రం రాజకీయ కుట్ర కారణంగా అడ్డుకట్ట పడుతోందన్నారు సీఎం సిద్దరామయ్య. కేంద్రం ఎంత రాజకీయం చేసినా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చితీరుతామని ధీమా వ్యక్తం చేశారు అన్నభాగ్య పథకం కోసం 2.28లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఎఫ్‌సీఐ లేఖ రాస్తే బియ్యం అంగీకార పత్రాన్ని పంపింది. అయితే కేంద్ర ఆహార శాఖ ఈనెల 13న కేంద్ర ఎఫ్‌సీఐకు ఇచ్చిన ఆదేశాలతో అన్నభాగ్య పథకానికి గండికొట్టినట్లు ఆరోపించారు.
కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్,చత్తీస్‌ఘడ్ నుంచి బియ్యాన్ని సేకరిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈనేపధ్యంలో కన్నడ సైర సరఫరాల మంత్రి కేహెచ్.మునియప్ప తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. తమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం చేసే ప్రయత్నాలు ప్రత్యక్షంగా పేదల కడుపు కొట్టే చర్యలేనని మండిపడ్డారు.