Hijab Karnataka: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..

Hijab Karnataka: కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Update: 2022-03-15 16:00 GMT

Hijab Karnataka: కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు.... దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును స్వాగతించారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. ఈ తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్ధులంతా సమానమన్నారాయన. మరోవైపు... హైకోర్టు తీర్పును శిరసావహిస్తామంటూనే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు తమకు ఉందన్నారు ముస్లిం పెద్దలు. యూనిఫామ్‌తో వెళ్లే బాలికలకు...హిజాబ్‌ ధరిస్తే.. తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పు మతం, సంస్కృతి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని.. ఆర్టికల్ 15కు వ్యతిరేకమన్నారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కర్ణాటక హైకోర్ట తీర్పును ఆయన ఖండించారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదన్నారాయన. హైకోర్ట్ ఉత్తర్వులు అల్లా ఆజ్ఞలు, విద్య మధ్య ఎంచుకోవాలని బలవంతం చేసేలా ఉన్నాయని విమర్శించారు.

Tags:    

Similar News