Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రిపై ఎఫ్‌ఐఆర్.. పదవికి రాజీనామా చేయాలని సీఎం ఆదేశం..
Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎపిసోడ్ కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప పదవికి గండం తెచ్చింది.;
Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎపిసోడ్ కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప పదవికి గండం తెచ్చింది. సీఎం బొమ్మై ఆదేశాలతో రాజీనామాకు సిద్ధపడ్డారు మంత్రి ఈశ్వరప్ప. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా సమర్పించనున్నారు. కాంట్రాక్టు పనుల్లో ముడుపుల కోసం ఈశ్వరప్ప పీఏ వేధింపులతో కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్‌లో ఈశ్వరప్ప పేరు వెలుగుచూడడంతో మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు రోడ్డెక్కాయి. దీంతో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో ఈశ్వరప్పపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.