Rajasthan: కర్ణిసేన చీఫ్​ హత్య రాష్ట్ర బంద్​కు పిలుపు

ఇంటి వద్దే కాల్పులు జరిపిన దుండగులు, నిందితుల్లో ఒకడు సైనికుడు;

Update: 2023-12-07 01:45 GMT

రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యను నిరసిస్తూ కర్ణిసేన రాజస్థాన్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది . సుఖ్‌దేవ్‌ సింగ్‌ను హత్య చేసిన వారిని పట్టుకోవాలని పలు జిల్లాలో సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు నిరసలు చేపట్టారు. ఝలావడ్‌లో వ్యాపారులు సుఖ్‌దేవ్ హత్యను నిరసిస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హింసాత్మక ఘటనలు జరగుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బరన్ పట్టణంలో కర్ణిసేన సభ్యులు స్థానిక ప్రతాప్ చౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. చురు పట్టణంలో సుఖ్‌దేవ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిందితులను పట్టుకోవాలని నినదించారు. ధోల్‌పుర్ జిల్లాలో కర్ణిసేన సభ్యులు టైర్లను కాల్చి తమ నిరసనను తెలిపారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

జైపుర్‌ జిల్లాలోని చాక్సు పట్టణంలో సుఖ్‌దేవ్ హత్యకు నిరసనగా పాఠశాలలు, దుకాణాలను మూసివేశారు. రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన అధ్యక్షుడ్ని హత్య చేసిన నిందితులను పట్టుకోవాలని సుఖ్‌దేవ్ మద్దతుదారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందించారు. నిందితులను పట్టుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని కర్ణిసేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వీ కుమారుడు బవాణీ సింగ్ కల్వీ తెలిపారు. సుఖ్‌దేవ్ హత్యపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుఖ్‌దేవ్‌కు అశోక్ గహ్లోత్ ప్రభుత్వమే భద్రతను తగ్గించిందని భాజపా ఆరోపించింది. సుఖ్‌దేవ్ హత్య విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపాఎంపీ దియా కుమారి ఆరోపించారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌కు భద్రత కల్పించడంలో అశోక్‌ గహ్లోత్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌ను హత్య చేసిన నిందితులు కోసం గాలిస్తున్నామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. హరియాణా పోలీసులు సహకారం కోరామని వెల్లడించారు. 

Tags:    

Similar News