Saif Ali Khan : సైఫ్‌పై కత్తి దాడి: పోలీసు శాఖ బిగ్ ట్విస్ట్

Update: 2025-01-22 09:30 GMT

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్‌ పీఐ సుదర్శన్ గైక్వాడ్‌ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్‌నూర్కర్‌ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.

సైఫ్‌పై దాడి నిందితుడు షరీఫుల్‌తో పోలీసులు సీన్‌ రీక్రియేషన్ చేశారు. ‘అతడు ఇంట్లోకి ప్రవేశించేముందు షూ విప్పేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కారిడార్‌లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. చోరీ చేసేందుకు సైఫ్ కొడుకు రూమ్‌లోకి ప్రవేశించగా పనిమనిషి తనను చూసి కేకలు వేసిందన్నాడు’ అని పోలీసులు తెలిపారు. తర్వాత సైఫ్ అతడిని పట్టుకునేందుకు చూడగా కత్తితో దాడి చేశాడని చెప్పారు.

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.

Tags:    

Similar News