Lalu Prasad Yadav: దాణా స్కామ్‌లో లాలూప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష..
Lalu Prasad Yadav: దాణా స్కామ్‌లో దోషిగా తేలిన లాలూప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది.;
Lalu Prasad Yadav: దాణా స్కామ్‌లో దోషిగా తేలిన RJD అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూ దోషిగా తేలినట్లు కోర్టు తెలిపింది.
లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 950 కోట్ల రూపాయల విలువైన దాణా స్కామ్ జరిగింది. ఇదే కుంభకోణంలోని మిగతా కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలడంతో లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడున్నర సంవత్సరాలుగా జైలుశిక్ష అనుభవిస్తూ అనారోగ్యం కారణాలతో ఇటీవలే పెరోల్‌పై విడుదలయ్యారు.
1996లో కేసు నమోదు కాగా 170 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో 55 మంది ఇప్పటికే మరణించారు. తాజా కేసు 139 కోట్ల రూపాయలకు సంబంధించినది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలుశిక్ష పడింది.