విమానంలో వింత ఘటన.. డ్రింక్ చేసిన న్యాయవాది 'హర హర మహాదేవ్ ' నినాదాలు
సోమవారం ఢిల్లీ-కోల్‌కతా ఇండిగో విమానంలో మద్యం తాగిన న్యాయవాది "హర్ హర్ మహాదేవ్" వంటి మతపరమైన నినాదాలు చేయడంతో పాటు తోటి ప్రయాణీకులను "జై శ్రీ రామ్" అని నినాదాలు చేయమని కోరడంతో గందరగోళం చెలరేగింది.
సోమవారం ఢిల్లీ-కోల్‌కతా ఇండిగో విమానంలో మద్యం తాగిన న్యాయవాది "హర్ హర్ మహాదేవ్" వంటి మతపరమైన నినాదాలు చేయడంతో పాటు తోటి ప్రయాణీకులను "జై శ్రీ రామ్" అని నినాదాలు చేయమని కోరడంతో గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత అతడు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
ఈ సంఘటన సోమవారం 6E 6571 న జరిగింది. దీంతో విమానం పార్కింగ్ బే వద్ద 30 నిమిషాలకు పైగా నిలిచిపోయింది. 31D లో కూర్చున్న న్యాయవాది క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు, మిగిలిన ప్రయాణీకులను కూడా ఇబ్బంది పెడుతున్నట్లు ఇండిగో తెలిపింది.
సాఫ్ట్ డ్రింక్ బాటిల్ లాగా కనిపించే దానిలో మద్యం తీసుకెళ్తున్నాడని ఆరోపించబడిన ప్రయాణికుడు, సిబ్బంది సభ్యురాలిని ప్రశ్నించడానికి ప్రయత్నించిన తర్వాత ఆమెపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసినట్లు సమాచారం.