Chief Defence Staff : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా అనిల్ చౌహాన్ నియామకం..

Chief Defence Staff : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ నియామకమయ్యారు;

Update: 2022-09-28 15:00 GMT

Chief Defence Staff : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ నియామకమయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బిపిన్‌ రావత్‌ మరణంతో సీడీఎస్‌ స్థానం ఖాళీగా ఉంది.

ఇప్పుడు ఆ స్థానంలో అనిల్ చౌహాన్‌ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పదవిలో నియమితులైన అనిల్‌ చౌహాన్‌.. మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు. దాదాపు 40 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో ఇండియన్‌ ఆర్మీలో పనిచేశారాయన. సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు.

అనిల్‌ చౌహాన్‌ మేజర్ జనరల్ హోదాలో ఉత్తర కమాండ్‌లోని బారాముల సెక్టార్‌లోని పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. సెప్టెంబరు 2019 నుంచి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మే 31 న పదవీ విరమణ చేసే వరకు ఇదే బాధ్యతలో కొనసాగారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో సహా ముఖ్యమైన సిబ్బంది నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. 

Tags:    

Similar News