Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్

మహిళా కమిషన్‌ ఉద్యోగులపై వేటు;

Update: 2024-05-03 01:45 GMT

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోనిఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్జీ​ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్‌ తీవ్రంగా ఖండించారు.

ఢిల్లీ మహిళా కమిషన్‌లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదించారు. దీంతో అక్రమంగా నియమితులైన కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిషన్‌లో 40 పోస్టులు మాత్రమే మంజూరైతే, 223 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని, నియామక ప్రక్రియ కూడా సరిగ్గా జరగలేదని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే, 52 మందిని నియమించారని, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ 52 మందిని విధుల నుంచి తొలగించినట్టు గురువారం పేర్కొన్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్‌ చట్టం ప్రకారం ప్యానెల్‌లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్‌ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్‌ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. 

లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నిర్ణయాన్ని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌ తప్పుపట్టారు. ఎల్జీ ‘తుగ్లక్‌’ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తే మహిళా కమిషన్‌కు తాళాలు వేయాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. రక్తం, చెమట ధారబోసి మహిళా కమిషన్‌ను నిర్మించామని, దీనికి సిబ్బందిని, రక్షణను ఇవ్వాల్సింది పోయి పునాదుల నుంచి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తాను జీవించి ఉన్నన్ని రోజులు కమిషన్‌ను మూతపడనివ్వనన్నారు. తాజా చర్యలతో మరోసారి ఆప్‌ ప్రభుత్వాని​కి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది.


Tags:    

Similar News