luknow Air Port: విమానం టైర్‌ భాగం నుంచి మంటలు… తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో ఘటన

Update: 2025-09-14 06:15 GMT

లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజుల ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మరవక ముందే.. మళ్లీ ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు.

జూన్‌ 12వ తేదీన అహ్మబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరిన విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… ల క్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. విమానం టైర్‌ భాగం నుంచి మంటలు రావడంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. మళ్లీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్‌ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్‌ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. ఎడమ టైర్‌ వద్ద ల్యాండింగ్‌ గేర్‌ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. స్పందించిన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ఘటన ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని లక్నో ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News