Madhya Pradesh Election 2023 : శివరాజ్ సింగ్ పై ఎన్నికల బరిలోకి రామాయణ్ నటుడు

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విక్రమ్ మస్తల్‌ బరిలోకి;

Update: 2023-10-15 10:03 GMT

నవంబర్‌లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో బుద్నీ నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విక్రమ్ మస్తల్‌ను బరిలోకి దించింది.

ఆనంద్ సాగర్ 2008 లో ప్రసారమైన టెలివిజన్ షో రామాయణంలో హనుమంతుని పాత్రను పోషించి మస్తల్ బాగా పేరు సాధించాడు. ఈ షోలో, గుర్మీత్ చౌదరి రాముడి పాత్రను పోషించగా, డెబినా బోనర్జీ సీతా దేవిగా కనిపించింది. ఈ ఏడాది జూలైలో మస్తాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రామాయణంతో పాటు, టాప్ గేర్ (2022), వెబ్ సిరీస్ బ్యాటిల్ ఆఫ్ సరాగర్హి (2017), ఆశ్రమ్ (2020)లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు.

ఇదిలావుండగా, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్‌ను ఆయన సొంతగడ్డ అయిన చింద్వారా నుంచి పోటీకి దింపింది. ఆయన ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన తొలిజాబితాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ రిపీట్‌ చేసింది. ఇందులో రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్‌ను రఘోఘర్ నుండి, సోదరుడు లక్ష్మణ్ సింగ్‌ను గుణలోని చచౌరా నుండి సిట్టింగ్ శాసనసభ్యులుగా నిలిపింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ గోవింద్ సింగ్ భింద్ జిల్లాలోని లాహర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్ బాలాఘాట్ జిల్లాలోని కటంగి నుంచి పోటీ చేయనున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో, 230 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకుంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రముఖ నాయకుడు కమల్ నాథ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే నాథ్ ప్రభుత్వం 15 నెలల తర్వాత కుప్పకూలింది. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులుగా ఉన్నారు, వారు పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మార్చి 2020లో శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కాషాయ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా 230 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 17న మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News