Maharastra: 20 ఏళ్ల విద్యార్థిని వీడ్కోలు ప్రసంగ చేస్తూ.. వేదికపైనే కుప్పకూలి..

మహారాష్ట్రలోని కళాశాలలో జరిగిన హృదయ విదారక సంఘటనలో 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని ధరాశివ్ నగరంలో ప్రసంగం మధ్యలో కుప్పకూలి మరణించింది.;

Update: 2025-04-07 04:54 GMT

మహారాష్ట్రలోని కళాశాలలో జరిగిన హృదయ విదారక సంఘటనలో 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని ధరాశివ్ నగరంలో ప్రసంగం మధ్యలో కుప్పకూలి మరణించింది.

ఆ యువతిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. కెమెరాలో రికార్డైన ఈ విషాద సంఘటన మొత్తం ఇంటర్నెట్‌లో విస్తృతంగా వ్యాపించింది. మీడియా నివేదికల ప్రకారం, వర్ష ఖరత్ అనే యువతి తన కళాశాల కార్యక్రమంలో మరాఠీలో ప్రసంగిస్తున్నట్లు వీడియోలో చూపబడింది.

ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ప్రేక్షకులు కూడా అదే తరహాలో నవ్వుతూ ఉండటం చూడవచ్చు, ప్రసంగిస్తున్న యువతి  హఠాత్తుగా మాటల వేగం తగ్గించి క్రమంగా వేదికపైకి పడిపోతుంది. ఈ సంఘటన తర్వాత విద్యార్థులు వేదికపైకి పరుగెత్తుకుంటూ వచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్షకు ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స జరిగింది, అనంతరం ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో మందులు కూడా తీసుకోవట్లేదు. 

మహారాష్ట్రలోని పరండా తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్‌జీ షిండే మహావిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News