Maharashtra Cabinet: పదిమందికి పైగా మంత్రులు.. 20కు పైగా ఎమ్మెల్యేలకు కరోనా..
Maharashtra Cabinet: మహారాష్ట్రను ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వణికిస్తున్నాయి.;
Maharashtra Cabinet (tv5news.in)
Maharashtra Cabinet: మహారాష్ట్రను ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వణికిస్తున్నాయి. అందోళన కలిగించే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ మహారాష్ట్ర క్యాబినెట్ పైగా పడుతోంది. తాజాగా మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ కు కరోనా సోకింది. దీంతో కరోనా బారిన పడ్డవారి మంత్రుల సంఖ్య పదికి చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది.
ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో ప్రారంభమైన కొన్ని రోజులకే అసెంబ్లీ ముగించాల్సి వచ్చింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు డిఫ్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు.