Ghulam Nabi Azad: ఇప్పటి ముస్లింలు.. ఒకప్పటి హిందువులు

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు... ఇస్లాం కంటే హిందూ మతమే పురాతనమైందని వ్యాఖ్య

Update: 2023-08-18 04:00 GMT

 దేశంలోని మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారినవారేనని(Majority of Indian Muslims converted from Hinduism) జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌( Ghulam Nabi Azad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు, కశ్మీరీ పండిట్లే ఉదాహరణ అని..కశ్మీర్‌ లోయలోని చాలా మంది పండిట్లు ఇస్లాంలోకి మారారని ఆజాద్ చెప్పారు. హిందూమతం చాలా ప్రాచీనమైందని(Hindu religion is very old), ఇస్లాం మతం కేవలం 1,500 ఏళ్ల కిందట నుంచి వచ్చిందని( Islam came to existence just 1,500 years ago) వ్యాఖ్యానించారు. కొంత మంది ముస్లింలు వేరే ప్రాంతాల నుంచి వచ్చారని బీజేపీ నేతలు అంటారని, అలా వచ్చిన వాళ్లు 10 నుంచి 20 మందే ఉంటారన్నారు. అంతేకాదు, 600 సంవత్సరాల కిందట కశ్మీర్‌లో ఎవరు ముస్లిం ఉన్నారా? అని ఆయన వ్యాఖ్యానించారు.


దొడ జిల్లాలోని ఓ మీటింగ్‌కి హాజరైన ఆజాద్ ఇస్లాం మతం 15 వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిందని, కానీ హిందు మతం అంతకుముందు నుంచే ఉందని పేర్కొన్నారు. కొందరు ముస్లింలు వలస వచ్చారని, మొఘల్ సైన్యం(Mughal army)లో చేరారని, క్రమంగా హిందు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయే సంఖ్య పెరుగుతూ వచ్చిందని తెలిపారు. ఈ మత మార్పిడి అంతర్గతంగానే తీవ్రస్థాయిలో జరిగిందని వెల్లడించారు. కశ్మీర్ పండింట్‌లు కూడా పెద్దఎత్తున ఇస్లాం మతంలోకి మారారని, అందుకే ఇప్పుడు కశ్మీర్‌లో పండిట్‌ల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు.

600 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో పండిట్‌లదే ఎక్కువగా ఉండేవారని, కానీ వాళ్లు క్రమంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆజాద్‌ అన్నారు. వీళ్లందరి మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయన్నారు. హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు.. ఇలా చెప్పుకోవడానికి పేరుకి వేరువేరుగా ఉన్నా, అందరి మూలాలు మాత్రం ఒక్కటేనని గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. మన పూర్వీకులంతా ఇక్కడే ఉన్నారని, బయటి నుంచి ఎవరూ రాలేదని తెలిపారు. మొదట్లో మొఘల్ ఆర్మీ కేవలం 10-12 మందితో ఇక్కడికి వచ్చిందని.. ఆ తర్వాతే మతమార్పిడి పెద్దఎత్తున జరిగిందన్నారు. ఇదే విషయాన్ని తాను చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు. గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యల వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాల పాటు పని చేశారు. ఆ పార్టీ నుంచి ఆయన జమ్మూ కాశ్మీర్ సీఎంగా, కేంద్రమంత్రిగా, ఉభయ సభల్లోఎంపీగా వ్యవహరించారు. కానీ.. గతేడాది ఆయన గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించారు.

Tags:    

Similar News