Mamata Banerjee: మంత్రివర్గంలో కొత్తవారికి చోటు- మమతా బెనర్జీ

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు దీదీ సిద్ధమైంది.

Update: 2022-08-01 14:45 GMT

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు దీదీ సిద్ధమైంది. ఆగష్టు 3 సాయంత్రం 4 గంటలకు తన కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. మంత్రివర్గంలో కనీసం నలుగురు లేదా ఐదుగురు కొత్తవారిని చోటు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ పార్థా ఛటర్జీ పేరును కూడా ప్రస్తావించారు. మొత్తం కేబినెట్‌ను రద్దు చేసి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని సీఎం మమతా అన్నారు.

మంత్రులు సబ్రతా ముఖర్జీ, సాధన్ పాండేలను కోల్పోయామని, పార్థా ఛటర్జీ జైలులో ఉన్నారని తెలిపారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. మరోవైపు బెంగాల్‌లో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు సీఎం మమతా బెనర్జీ. ప్రస్తుతం 23 జిల్లాలుగా ఉన్న వెస్ట్‌ బెంగాల్‌లో ఏడు కొత్త జిల్లాలతో కలిపి 30 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుందర్బన్, ఇచ్చేమటి, రానాఘాట్, బిష్ణుపూర్, జంగీపూర్, బెహ్రంపూర్, బసీర్‌హట్ నగరాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 

Tags:    

Similar News