Viral: దహన సంస్మారాలకు ముందు చితిపై లేచిన శవం..

చనిపోయినట్లు వైద్యులు ప్రకటించిన వ్యక్తి.. చితిపై స్పృహలోకొచ్చాడు!ముగ్గురు డాక్టర్లపై వేటు

Update: 2024-11-23 02:30 GMT

డాక్టర్లు చనిపోయినట్టు ప్రకటించిన ఓ వ్యక్తి దహన సంస్కారానికి కొన్ని క్షణాల ముందు స్పృహలోకి రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోహితాశ్ కుమార్(25) అనే చెవిటి, మూగ వ్యక్తి షెల్టర్ హోమ్​లో ఉండేవాడు. గురువారం అతడి ఆరోగ్యం క్షీణించడంతో నిర్వాహకులు ఝుంఝునులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసినా పరిస్థితి విషమించి మధ్యాహ్నం 2 గంటలకు రోహితాశ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసులు వచ్చి పంచనామా పూర్తిచేశాక క్రిమటోరియంలో అంత్యక్రియలు చేస్తుండగా రోహితాశ్​ సడెన్​ ఊపిరి పీలుస్తుండడం గుర్తించి తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం జైపూర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వైద్యులను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందించారు. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రోహితాష్ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. దీంతో షెల్టర్ హోం నిర్వాహకులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసి.. చితిపై రోహితాష్ కుమార్ మృతదేహాంగా పెడుతున్న సమయంలో అతడు శ్వాస తీసుకోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే అంబులెన్స్ లో రోహితాష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారి మహేంద్ర ముండ్, సామాజిక న్యాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

అయితే ఈ ఘటనపై జుంజును జిల్లా కలెక్టర్ రమన‌తార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల తీరును తీవ్రంగా ఖండించారు. చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, డాక్టర్ సందీప్ పచార్‌లను గురువారం రాత్రి సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య శాఖ కార్యదర్శికి సమాచారం అందించినట్లు కలెక్టర్ మీనా తెలిపారు.

Tags:    

Similar News