Amazon: కెమెరా లెన్స్ ఆర్డర్ ఇస్తే….

ఆన్లైన్ ఆర్డర్ లో మరో గందరగోళం

Update: 2023-07-17 10:45 GMT

కొంత కాలంగా మనం బయటకు వెళ్లి షాపింగ్ చేయడం పూర్తిగా మర్చిపోయాం. ఏం కావాలన్నా ఇ- కామర్స్ వెబ్ సైట్లలోనే షాపింగ్ చేస్తున్నాం.. ఒకసారి వస్తువులు బానే వస్తాయి కానీ.. ఒక్కోసారి డబ్బులు పోయి వింతైన అనుభవాలు మిగులుతాయి..

తాజాగా అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే రూ.90 వేలు పెట్టి ఓ కెమెరా లెన్స్‌ను అమెజాన్‌లో ఆర్డరిచ్చాడు. ఆ తరువాత దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూశాడు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. డెలివరీ బాయ్ ఇచ్చిన బాక్స్ ఆత్రంగా ఓపెన్ చేసాడు. అందులో కనపడినవి చూసి షాక్ అయ్యాయి. 90 వేల రూపాయల కెమెరా లెన్స్ ఉండాల్సిన చోట కీన్వా సీడ్స్ ఉన్నాయి. అరుణ్ కు వళ్ళు మండిపోయింది బాక్స్ అప్పటికే తెరిచి ఉండడంతో పాటు కెమెరా లెన్స్‌కు బదులుగా క్వినోవా విత్తనాలు ఉన్నాయని ఆరోపిస్తూ లెన్స్ బాక్స్‌లో ప్యాక్ చేసిన క్వినోవా విత్తనాలను చూపించే రెండు ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "అమెజాన్ నుండి 90K INR కెమెరా లెన్స్‌ను ఆర్డర్ చేశాను. వారు లెన్స్‌కు బదులుగా క్వినోవా విత్తనాల ప్యాకెట్‌తో కూడిన లెన్స్ బాక్స్‌ను పంపారు. @amazonIN, Appario రిటైల్ ద్వారా పెద్ద స్కామ్. లెన్స్ బాక్స్ కూడా తెరిచారు. వీలైనంత త్వరగా పరిష్కరించండి" అని ట్వీట్ చేశాడు. అయితే దీనిపై అమెజాన్ స్పందించింది. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.

వైరల్ గా మారిన ఈ ఈ ట్వీట్ పై చాలామంది స్పందించారు. అమెజాన్ పై విమర్శల వర్షం కురిపించారు. అమెజాన్ రిటర్న్ పాలసీ విచిత్రంగా ఉంటుందని పేర్కొన్న ఒక వ్యక్తి తాను గత సంవత్సరం సిగ్మా 150-600 లెన్స్‌ని ఆర్డర్ చేస్తే కుట్టుమిషన్ పంపారని కామెంట్ పెట్టాడు.. దీంతో ఈ ట్వీట్ పై అమెజాన్ మరోసారి స్పందించింది. దయచేసి మాకు డైరెక్ట్ మెసేజ్ చేయగలరు అంటూ రిక్వెస్ట్ చేసింది.

Tags:    

Similar News