Bank On Fire: లోన్ ఇవ్వనన్నారు.. అందుకే బ్యాంకునే తగలబెట్టాడు..

Bank On Fire: లోన్ రిజెక్ట్ చేశారని బ్యాంకుకే నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Update: 2022-01-12 02:22 GMT

Bank On Fire: ప్రజలకు సేవ చేసే సర్వీసెస్‌లో బ్యాంక్ కూడా ఒకటి. అయితే ఈ బ్యాంకులు కూడా చాలామందికి సహాయం చేయడంలో వెనకబడి ఉంటాయి. అందుకే వాటిపై ప్రజలలో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా లోన్స్ విషయంలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. అలా లోన్ విషయంలోనే బ్యాంకుపై ఆగ్రహం తెచ్చుకున్న ఓ వ్యక్తి బ్యాంకుకే నిప్పంటించాడు.

లోన్ రిజెక్ట్ చేశారని బ్యాంకుకే నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో నివాసముండే 33 ఏళ్ల వాసిమ్ హసరత్సబ్ ముల్లా.. హేడుగొండ గ్రామంలోని కెనరా బ్యాంకులో లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ పలు కారణాల వల్ల లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకు యాజమాన్యం తేల్చి చెప్పేసింది. దీంతో ముల్లా ఆగ్రహానికి లోనయ్యాడు.

ఒక అర్థరాత్రి ఆ బ్యాంకు దగ్గరకు వెళ్లిన ముల్లా.. ఓ అద్దాన్ని పగలకొట్టి లోపల పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నిప్పంటించాడు. స్థానికులు మంటలను గమనించి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన వల్ల బ్యాంకుకు 12 లక్షల ఆస్తినష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అయిదు కంప్యూటర్‌లు, ఫ్యాన్లు, లైట్లు, పాస్‌బుక్ ప్రింటర్, క్యాష్ లెక్కించే మెషిన్‌లు, సీసీ కెమెరాలు, క్యాష్ కౌంటర్‌లు పూర్తిగా ధ్వంసమయినట్టు వారు తెలిపారు.

Tags:    

Similar News