Giriraj Singh: కేంద్రమంత్రిపై బీహార్‌లో దాడికి యత్నం

నిందితుడిని షాజాద్ అలియాస్ సైఫీగా గుర్తింపు, అరెస్ట్;

Update: 2024-09-01 02:15 GMT

బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడి ప్రయత్నం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఘటన జరిగింది. దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బీహార్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మైక్రోఫోన్‌ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.

బీహార్‌లోని బెగుసరాయ్‌లో శనివారం జరిగిన బహిరంగ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు. రాజధాని పాట్నాకు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత నియోజకవర్గంలో జనతా దర్బార్ నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు మరియు భద్రతా సిబ్బంది అప్రమత్తతతో రక్షించారు. నిందితుడ్ని బీజేపీ శ్రేణులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈవెంట్ నుంచి బయటకు వస్తుండగా తనపై ఓ వ్యక్తి దాడికి యత్నించాడని గిరిరాజ్‌సింగ్ పేర్కొన్నారు. ముర్దాబాద్ నినాదాలు చేశాడని చెప్పారు. అయినా ఇలాంటి దాడులకు భయపడనని చెప్పారు. ఆ వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉంటే చంపేసే వాడని కేంద్రమంత్రి అన్నారు. తాను ఎల్లప్పుడూ సమాజ ప్రయోజనాల కోసం మాట్లాడతానని వెల్లడించారు. మత సామరస్యాన్ని చెడగొట్టాలని కోరుకునేవారికి వ్యతిరేకంగా గొంతు విప్పుతామని చెప్పారు. నిందితుడు తమ అదుపులో ఉన్నాడని బెగుసరాయ్ పోలీసు సూపరింటెండెంట్ మనీష్ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News