Cm Biran singh :మణిపూర్ అల్లర్లు ప్రీ ప్లాన్డ్

అన్ని తెగలు కలిసి జీవించాలని పిలుపునిచ్చిన సీఎం;

Update: 2023-07-02 06:45 GMT

మణిపూర్ హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

జాతుల మధ్య కొనసాగుతున్న వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించినప్పటికీ ఎక్కడో ఓ చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు నెలల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న మే 3 న గిరిజన సంఘీభావ కవాతు జరిగినప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.




 


మణిపూర్ సరిహద్దుల్లో మయన్మార్, చైనా కూడా ఉన్నాయని, అయినప్పటికీ సరిహద్దుల్లో దాదాపు 398 కిలోమీటర్ల వరకు ఎటువంటి రక్షణ లేదన్నారు. సరిహద్దుల్లో భద్రతా దళాలను మోహరించామని, ఎంత పెద్ద ఎత్తున భద్రతా దళాలను ఉంచినా ఇంత సువిశాల ప్రాంతాన్ని కట్టుదిట్టంగా భద్రత పరిధిలోకి తేవడం సాధ్యం కాదని చెప్పారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదంతా ముందస్తు ప్రణాళికతోనే జరుగుతున్నట్లు కనిపిస్తోందని, ఈవిషయాన్ని దృఢంగా చెప్పలేమని, అలా అని పూర్తిగా నిరాకరించలేమని అన్నారు. మణిపూర్‌ను జాతి ప్రాతిపదికన చీల్చేందుకు తాను అనుమతించబోనని, అన్ని తెగలు కలిసిమెలసి జీవించాలని పిలుపునిచ్చారు.

ఏది ఏమైనాప్పటికీ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించడం గురించి ప్రస్తావిస్తూ, ఇదంతా రాజకీయ ఎజెండాతో జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆయన పర్యటించిన సమయం సరైనదని తాను భావించడం లేదన్నారు.

అంతకు ముందు రాష్ట్రంలోని కుకీ వర్గం ప్రజలను అవహేళన చేస్తూ ట్విట్టర్‌లో బీరేన్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేస్తారంటూ రాజధాని ఇంఫాల్‌లో పెద్ద హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయట్లేదని సీఎం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పలువురు చేసిన కామెంట్లకు బీరేన్‌ సింగ్‌ స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినట్టుగా సమాధానం ఇవ్వడం పై యూజర్లు మండిపడ్డారు. తరువాత ఆ రిప్లయ్ ట్వీట్లు అన్నింటినీ తర్వాత తొలగించారు.

మరోవైపు మణిపూర్ లో హింస ఏ మాత్రం ఆగలేదు అర్ధరాత్రి జరిగిన హింసలో మొయితి వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్ లు కాల్చి చంపారు. ఈ ఘటన కూజుమా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మైతీలు ఒక గ్రామాన్ని దహనం చేశారు.

Tags:    

Similar News