Manipur Election: ఈసీ షాకింగ్ నిర్ణయం.. మణిపూర్ ఎన్నికల విషయంలో..

Manipur Election: ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికల పోరు ముగిసింది.;

Update: 2022-02-11 04:00 GMT

Manipur Election: ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికల పోరు ముగిసింది. మిగిలిన రాష్ట్రాల్లోను పోలింగ్ సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 27న జరగాల్సిన తొలిదశ పోలింగ్ 28న, మార్చి 3న జరిగే రెండో దశ ఓటింగ్ 5వ తేదీకి మార్చింది. ఎన్నికల ఫలితాలు మాత్రం మార్చి 10నే వెలువడుతుందని ఈసీ తెలిపింది.

ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరక ఏడుదశల్లో యూపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. అయితే పంజాబ్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీలోను మార్పులు చేసింది. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉన్నందున పోలింగ్ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14కు బదులు 20న ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపింది. 

Tags:    

Similar News