Manish Sisodia : నా లాకర్‌లో ఏమీ లేవు.. సత్యం గెలిచింది : మనీష్ సిసోడియా
Manish Sisodia : తన బ్యాంక్ లాకర్‌లో సీబీఐ ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు.;
Manish Sisodia : తన బ్యాంక్ లాకర్‌లో సీబీఐ ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. తనకు క్లీన్‌చిట్ లభించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. సీబీఐ అధికారులకు తాము పూర్తిగా సహకరించామన్నారు. వారు కూడా తమను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యం గెలిచిందని సిసోడియా తెలిపారు. సీబీఐ అధికారులు ఘజియాబాద్‌లోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌లో సోదాలు నిర్వహించారు.