Manmohan Singh Fulfilled Telangana : తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్
తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు