Delhi: స్నేహం పేరుతో హోటల్‌కు పిలిచి ఎంబీబీఎస్ విద్యార్థి అత్యాచారం

డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం చేశాడంటూ విద్యార్థిని ఫిర్యాదు

Update: 2025-10-06 08:15 GMT

ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రెండ్‌షిప్‌ పేరుతో హోటల్‌కు రప్పించి డ్రగ్స్‌ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హర్యానాలోని జింద్‌కు చెందిన 18 ఏళ్ల యువతి ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నది. కాలేజీ హాస్టల్‌ క్యాంపస్‌లో ఆమె నివసిస్తున్నది.

కాగా, తోటి మెడికల్‌ స్టూడెంట్‌ అయిన 20 ఏళ్ల యువకుడు సెప్టెంబర్ 9న స్నేహం పేరుతో ఆదర్శ్‌నగర్‌లోని హోటల్‌కు తనను రప్పించాడని ఆ యువతి తెలిపింది. హోటల్‌ రూమ్‌లో తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తన ఫొటోలు తీసి, వీడియో రికార్డ్‌ చేసి బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు వైద్య విద్యార్థిని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడైన తోటి మెడికో కోసం వెతుకున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Tags:    

Similar News