Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చన్న మంత్రి అతిషి

Update: 2024-07-17 09:41 GMT

ఢిల్లీ సీఎం కేజీవాలు ( Arvind Kejriwal ) బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చని మంత్రి అతిషి అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కేజ్రివాల్ ఆరోగ్యంపై తీహార్ అధికారులు ఖండించిన నేపథ్యంలో తాజాగా అతిషి ఈ మేరకు స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న కేజీవాల్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మధుమేహ రోగులకు కోమా, స్ట్రోక్ వంటి ప్రమాదాలు రావొచ్చన్నారు ఆతిషి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తీహార్ జైలు అధికారులు బీజేపీ పత్రాలను విడుదల చేస్తోందని ఆమె విమర్శించారు. తీహార్ జైలులో సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News