Hijab Karnataka: సుప్రీంకోర్టుకు మైనార్టీ విద్యార్థులు.. అప్పటివరకు ధార్మిక దుస్తులు ధరించవద్దంటూ..

Hijab Karnataka: డ్రెస్‌కోడ్‌ వివాదంపై మైనార్టీ విద్యార్థులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2022-02-11 08:11 GMT

Hijab Karnataka: డ్రెస్‌కోడ్‌ వివాదంపై మైనార్టీ విద్యార్థులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ కర్నాటక హైకోర్టులో కొనసాగుతున్నందున ముందు ఆ ప్రక్రియ పూర్తి కానివ్వండని నిన్ననే CJI బెంచ్‌ స్పష్టం చేసింది. ఆ తర్వాత దాన్ని సుప్రీంకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించింది. ఐతే.. ఇవాళ మరికొందరు పిటిషన్‌ వేసిన నేపథ్యంలో.. CJI దీనిపై విచారణ జరిపారు. దీన్ని జాతీయ స్థాయిలో వివాదం చెయ్యొద్దని, సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేశారు.

దీనిపై తక్షణ విచారణ అవసరం లేదని చెప్పారు. ఇలాంటివి పెద్దఎత్తున వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. కర్నాటకలో ఏమి జరుగుతుందో తాము చూస్తున్నామన్న ధర్మాసనం.. ఏదైనా తప్పు జరిగితే కాపాడతాము, విచారిస్తాము , తగిన సమయంలో జోక్యం చేసుకుంటామని పిటిషనర్లకు స్పష్టం చేసింది. అటు, ఇవాళ్టి నుంచి కర్నాటకలో మళ్లీ పాఠాశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ హిజాబ్‌ వివాదం మిగతా రాష్ట్రాల్లోనూ ముదరకముందే దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని న్యాయస్థానాలు భావిస్తున్న నేపథ్యంలో.. విచారణ స్పీడ్‌గానే కొనసాగనుంది. 

Tags:    

Similar News