Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' బస ఏర్పాట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించుకుని బస చేసే ప్రాంతంలో మిని సిటీనే ఉన్నట్లు ఉంటుంది;
Bharat Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 7న ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే రాహుల్‌గాంధీ,ఆయనతోపాటు ఈ యాత్రలో పాల్గొంటున్నవారు సేదదీరేందుకు చేసిన ఏర్పాట్లపై అందరికి ఆసక్తి నెలకొంది. అయితే రాహుల్ టీం దాదాపు అరవై కంటెయినర్లలో ఓ చిన్నపాటి విలేజ్‌ను ప్లాన్ చేశారు ఇందులో అన్నీ సదుపాయాలు అంటుబాటులో ఉన్నాయి. రాహుల్ గాంధీ సూచనతో స్టార్ హోటళ్లలో బస కాకుండా కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. వాటి వివరాలు ఓ సారి చూద్దాం.
ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించుకుని బస చేసే ప్రాంతంలో మిని సిటీనే ఉన్నట్లు ఉంటుంది. దాదాపు అరవై భారీ కంటైనర్లు ఒకేచోట ఆగి ఉంటాయి. వీటిల్లో రాహుల్‌గాంధీతో ఇతర కాంగ్రెస్ నేతలు భద్రతా సిబ్బంది, రాహుల్ పర్సనల్ టీం సేదదీరేందుకు పూర్తిస్థాయి సదుపాయాలతో తగిన ఏర్పాట్లు ఉన్నాయి.తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఐదు నెలలపాటు జరిగే భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు దాదాపు 120 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు.
ఇక ఓ కంటెయినర్‌ను చిన్నపాటి మీటింగ్‌హాల్ గా తీర్చిదిద్దారు. బెడ్స్ సంఖ్యను బట్టి వేర్వేరు రంగుల ప్రదేశాలలో ఈ కంటెయినర్లను నిలుపుతారు.అంటే పసుపు రంగు ప్రాంతంలో ఒక బెడ్, ఒక కోచ్, వాష్‌రూం ఉన్న కంటెయినర్‌ను నిలుపుతారు. ఒకటో నెంబర్ పసుపు రంగు కంటెయినర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు.రెండో కంటెయినర్‌లో ఆయన భద్రతా సిబ్బంది ఉంటారు. బ్లూ జోన్ కంటెయినర్లలో రెండు బెడ్స్ ఉంటాయి. ఓ వాష్‌రూమ్ కూడా ఉంటుంది.రెడ్,ఆరెంజ్ కలర్ ప్రాంతంలో నిలిపే కంటెయినర్లలో నలుగురు బస చేయవచ్చు. అయితే వీటిలో అటాచ్ బాత్‌రూం సౌకర్యం ఉండదు.
పింక్ కలర్ ప్రాంతంలో మహిళా నేతల కోసం కంటెయినర్లను నిలుపుతారు. వీటిలో నాలుగు బెడ్స్‌ఉంటాయి.స్లీపర్ బస్సులో ఉండే విధంగా అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్ ఉంటాయి. వీటికి అటాచ్డ్ బాత్‌రూమ్స్ కూడా ఉంటాయి. ఈ బెడ్స్ దగ్గర స్టోరేజ్ స్పేసెస్ కూడా ఉంటాయి. కామన్ టాయ్‌లెట్స్ ఉన్న కంటెయినర్లకు ఇంగ్లీష్ అక్షరం 'టి' తో మార్క్ చేశారు. మొత్తం మీద ఏడు టాయ్‌లెట్స్ ఉన్నాయి. వీటిలో ఐదు జెంట్స్ టాయిలెట్ కాగా రెండు ఉమెన్స్ రెస్ట్‌రూంలు ప్లాన్ చేశారు. ప్రతి క్యాంప్ సైట్‌లో కామన్ డైనింగ్ ఏరియా ఉంటుంది.
మరోవైపు ప్రతి రోజూ ఉదయమే రాహుల్ ఆయన టీం పాదయాత్రకు బయల్దేరిన తర్వాత ఈ కంటెయినర్లను క్లీనింగ్ చేయడానికి హౌస్ కీపింగ్ స్టాఫ్ రెడీగా ఉంటారు. బెడ్స్‌పై దుప్పట్లతో పాటు టవల్స్ నైట్‌వేర్ ను కూడా వీరు క్లీన్ చేసి పెడుతారు. రాహుల్ ఒకటో నెంబర్ కంటైనర్‌లో ఉంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్,ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మూడో నెంబర్ కంటైనర్‌లో ఉంటారు. రాహుల్ పర్సనల్ టీం అలంకార్ సవాయ్, కేబీ బైజు నాలుగో కంటైనర్‌లో ఉంటారు.ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బ్లూ జోన్‌లో పదిహేనో నెంబర్ కంటైనర్‌లో బస చేస్తారు.
అయితే రాహుల్ పాదయాత్ర టీం స్టే చేసే చోట స్మోకింగ్, డ్రింకింగ్ ను నిషేదించారు.కంటైనర్ల లోపల కూడా ఫుడ్ ఐటమ్స్ తినకూడదన్న ఓ రూల్ కూడా పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటున్న నేతలు లాండ్రీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.ఇక వ్యక్తిగత వస్తువులు,బంగారం,నగదు వంటి విలువైన వస్తువులు పోతే పాదయాత్ర ఆర్గనైజర్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బాధ్యత వహించదని రాహుల్ పాదయాత్ర రూల్స్ బుక్ చెబుతుంది.