Monkey Pox : మంకీపాక్స్ రెండో కేసు.. విదేశాల నుంచే దిగుమతి..

Monkey Pox : దేశంలో మంకీపాక్స్ అలజడి కొనసాగుతోంది. మొదటి కేసు నమోదైన నాలుగు రోజుల వ్యవధిలో రెండో కేసు వెలుగు చూసింది.;

Update: 2022-07-19 01:57 GMT

Monkey Pox : దేశంలో మంకీపాక్స్ అలజడి కొనసాగుతోంది. మొదటి కేసు నమోదైన నాలుగు రోజుల వ్యవధిలో రెండో కేసు వెలుగు చూసింది. కేరళకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా గుర్తించారు. మొదటి కేసు కూడా కేరళలోనే నమోదైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చేవారికి మెడికల్ టెస్టులు తప్పనిసరి చేసింది.

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కేరళలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. కేరళ కన్నూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. దుబాయి నుంచి ఈ నెల 13న మంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. వెంటనే అతని శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. దీంతో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం అతనికి పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ వైద్యాధికారులు తెలిపారు.దేశంలో మొదటి మంకీపాక్స్ కేసును సైతం కేరళలోనే గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ నెల 14న మంకీపాక్స్ నిర్ధారించారు.

కేరళలో రెండో మంకీపాక్స్ కేసు బయటపడడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు కఠినంగా నిర్వహించాలని ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్లు హాజరయ్యారు. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్రం ఆదేశించింది.

ఇటు కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌ రావు. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ, నోటల్‌ హాస్పిటల్‌గా ఫీవర్‌ హాస్పిటల్‌ను ప్రకటించారు.

మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

మంకీపాక్స్ ఇప్పటివరకూ 59 దేశాలకు విస్తరించింది. 6 వేల మందికి మంకీపాక్స్ పాజిటివ్ రాగా...ఇప్పటివరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా ఆఫ్రికా, యూరప్‌లోనే నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

Tags:    

Similar News