MONSOON: మే 27 నాటికి కేరళకు రుతుపవనాలు
జాన్ 5 నాటికి తెలంగాణకు రానున్న రుతుపవనాలు;
భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న సమయం కంటే ముందే రుతుపవనాలు వచ్చేస్తున్నట్టు వెల్లడించింది. మే 30 నాటికి దేశంలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతకంటే ముందుగానే వచ్చేస్తున్నట్టు మారిన వాతావరణం బట్టీ ఐఎండీ స్పష్టం చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా అనుకున్న అంచనాలు కంటే నాలుగు రోజులు ముందుగానే వచ్చేస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే 15 తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఉన్న అనుకూల వాతావరణం చూస్తే ఈ రెండు రోజుల్లోనే వర్షావరణం ప్రారంభంకానుందని స్పష్టమవుతుంది. రేపు లేదా ఎల్లుండి ఉదయం అండమాన్‌కు తాకనున్న రుతుపవనాలు... 25 తర్వాత ఎప్పుడైనా కేరళను తాకబోతున్నాయి. మే 27న రుతు పవనాలు కేరళను తాకనున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే అవకాశం ఉంది. **సాధారణం కన్నా అధికంగా పడే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది.