Uttar Pradesh: కుమార్తె మామతో వెళ్ళిపోయిన తల్లి..

ఇంట్లోని నగలు, నగదుతో జంప్;

Update: 2025-04-20 02:00 GMT

ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఒక మహిళ తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయింది. ఈ సంఘటన యావత్ దేశంలో వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటి మరో సంఘటన యూపీలోని బాదౌన్‌లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తె మామగారితో పారిపోయింది. మమత అనే మహిళ, తన కూతురి మమా శైలేంద్ర అలియాస్ బిల్లుతో లేచిపోవడం సంచలనంగా మారింది.

ఆ మహిళ భర్త సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను నెలకు రెండుసార్లు మాత్రమే ఇంటికి వచ్చే వాడినని, తాను లేనప్పుడు తన భార్య మమత తన కుమార్తె మామగారిని ఇంటికి రమ్మని చెప్పేదని అతను చెప్పాడు. శైలేంద్ర వచ్చినప్పుడల్లా తను వేరే గదిలోకి వెళ్లుమని చెప్పేదని మమత కుమారుడు కూడా చెప్పాడు.

43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావద్దని పారిపోయినట్లు సమాచారం. మమత పిల్లల్లో ఒక కుమార్తెకి 2022లో వివాహం జరిగింది. ఆమె కుమార్తె మామ అయిన శైలేంద్ర (46)తో కాలక్రమేణా సంబంధాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. మమత భర్త ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా ఇంటికి డబ్బులు పంపేవాడిని, తాను లేనప్పుడు మమతా శైలేంద్రను కలిసేదని చెప్పాడు.

మమతా కుమారుడు మాట్లాడుతూ, తన తండ్రి అరుదుగా ఇంట్లో ఉండేవాని, ప్రతీ మూడో రోజు అమ్మ(మమతా) శైలేంద్రను ఇంటికి పిలిచేదని, తమని వేరే గదికి పంపేదని, ఇప్పుడు ఆమె అతడితో పారిపోయిందని చెప్పాడు. శైలేంద్ర అర్ధరాత్రి మమత ఇంటికి వచ్చి, తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని పొరుగువారు కూడా చెప్పారు. సునీల్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో శైలేంద్రపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News