MS Swaminathan: భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

Update: 2023-09-28 07:00 GMT

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు, ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.  దాంతో భారత దేశం ఇతర దేశాలపై ఆహారం కోసం ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయనకు పద్మభూషన్, రామన్ మెగసెసే పురస్కారాలు లభించాయి.

Tags:    

Similar News