Airport Drug Bust: 40 కేజీల విదేశీ గంజాయి సీజ్..! విలువ రూ.40 కోట్ల పైమాటే

బ్యాంకాక్ నుంచి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు

Update: 2025-12-31 02:45 GMT

గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏకంగా రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

వివరాల్లోకి వెళ్తే… బ్యాంకాక్ నుంచి వచ్చిన 9 మంది స్మగ్లర్లు గంజాయిని లగేజ్ బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలించే యత్నం చేశారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజ్ బ్యాగుల్లో దాచిన భారీ మొత్తంలో విదేశీ గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కేజీల విదేశీ గంజాయి పట్టుబడటంతో ముంబయి విమానాశ్రయంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News