Times Tower: ముంబైలోని టైమ్స్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం.
మంటలార్పుతున్న ఫైర్ ఇంజన్లు;
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని టైమ్స్ టవర్ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ భవనం ఏడు అంతస్తులు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాద వార్త తెలియగానే 8 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. ఏడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. లోయర్ పరేల్ ప్రాంతంలోని కమ్లా మిల్ కాంప్లెక్స్‌లోని టైమ్స్ టవర్ భవనంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక శాఖ దీనిని లెవెల్ 2 (పెద్ద) అగ్నిప్రమాదంగా ప్రకటించింది. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, ఇతర అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారి తెలిపారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. ఇటీవల జూన్‌లో, దక్షిణ ముంబైలోని బైకుల్లా ప్రాంతంలోని 57 అంతస్తుల నివాస భవనంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బృందం ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను ఆర్పింది.