Rajasthan Jail: ప్రేమలో పడ్డ ఖైదీలు.. పెళ్లి కోసం పెరోల్ జారీ
రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు
వాళ్లిద్దరు వేర్వేరు హత్యల్లో దోషులు. ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. వారు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరుకుంటోంది. ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరూ వేర్వేరు హత్యలకు జైలు పాలయ్యారు. ప్రియ, హనుమాన్ ప్రసాద్ జైపూర్‌లోని సంగనేర్ ఓపెన్ జైలులో కలుసుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు అల్వార్‌లోని బరోడమేవ్‌లో వివాహం చేసుకోవడానికి 15 రోజుల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది. ప్రియ, హనుమాన్ ప్రసాద్ ఈరోజు, శుక్రవారం, జనవరి 23న వివాహం చేసుకోనున్నారు.
ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. అతను నలుగురు పిల్లలను, ఒక యువకుడిని చంపాడు. హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియ సేథ్ (33) యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను తన స్నేహితురాలితో కలిసి ఆమె భర్త బన్వారీ లాల్‌ను హత్య చేశాడు. హత్యలు జరిగిన ఇంట్లో ప్రసాద్ ముగ్గురు పిల్లలు మరియు మేనల్లుడు కూడా ఉన్నారు. అరెస్టుకు భయపడి, ప్రసాద్ ఆమె ఆదేశం మేరకు, నలుగురు పిల్లలను కత్తితో చంపాడు. 2018లో జరిగిన హత్య కేసులో ప్రియా సేథ్ దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తోంది.
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్‌లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. హంతకుల మధ్య ప్రేమ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.