Narendra Modi: మణిపూర్‌లో ప్రచారం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..
Narendra Modi: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తోంది.;
Narendra Modi: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ప్రధాని మోదీ ప్రతిరోజూ రెండు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. మణిపూర్ హింగాంగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలనలో అసమానతలే రాజ్యమేలాయని ఆరోపించారు. గత ఐదేళ్లలో బీజేపీ చేపట్టిన అభివృద్ధితో వచ్చే 25 ఏళ్లకు పునాది వేశామన్నారు. మణిపూర్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.