Narendra Modi: నిరుద్యోగులకు మోదీ శుభవార్త.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ..
Narendra Modi: ఎట్టకేలకు కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి PMO గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.;
Narendra Modi: ఎట్టకేలకు కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి PMO గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఆ తర్వాత 10 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాదిన్నరలో ఈ 10 లక్షల ఖాళీల్ని భర్తీ చేయాలని నిర్ణయించినట్టు PMO ట్వీట్ చేసింది. విపక్షాలన్నీ తరచూ ఉద్యోగాల భర్తీపై కేంద్రంలోని BJPని నిలదీస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటికల్లా రిక్రూట్‌మెంట్ పూర్తి చేయడం రాజకీయంగానూ తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.