బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో లింక్ లను కనిపెట్టే ప్రయత్నంలో డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తోంది..;
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో లింక్ లను కనిపెట్టే ప్రయత్నంలో డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తోంది మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి).. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు.. తాజాగా మాదకద్రవ్యాల సేకరణ మరియు వినియోగం ఆరోపణలపై మంగళవారం బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది ఎన్‌సిబి. అరెస్టు చేసిన మరో ముగ్గురు నిందితుల తోపాటు ఆమెను సెప్టెంబర్ 9 న కోర్టుకు హాజరుపరుస్తారు. తదుపరి విచారణ కోసం ఈ నలుగురినీ పోలీసు రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని ఎన్‌సిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.