మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలపై NCRB సంచలన నివేదిక

Update: 2020-10-07 06:45 GMT

భారత్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సంచలన నివేదిక వెల్లడించింది. దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని తెలిపింది. మహిళలు, బాలికలకు ఏ రాష్ట్రంలోనూ రక్షణ లేదని NCRB తెలిపింది. 2018తో పోలిస్తే... 2019లో మహిళలపై 7.3 శాతం అఘాయిత్యాలు పెరిగాయని తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 4 లక్షల 5 వేల 861 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇక నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని NCRB తెలిపింది. 

Tags:    

Similar News