Neet Pg 2024 New Date: ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష
రెండు షిఫ్టుల్లో పరీక్ష ఎన్‌బీఈఎంఎస్;
జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 11కు రీషెడ్యూల్ చేశారు. అదే రోజు రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) శుక్రవారం స్పష్టం చేసింది. ఈ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్ తేదీని 2024 ఆగస్టు 15గా నిర్ణయించింది. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొంది. దీంతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను జూన్ 22న కేంద్రం వాయిదా వేసింది. తాజాగా ఆగస్టు 11కు నీట్ పీజీ ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేసింది. కాగా, నీట్ పీజీ ప్రవేశ పరీక్షను 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ సైన్సెస్' టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో కలిసి ప్రతి ఏటా నిర్వహిస్తుంది.