Neha Singh Rathore: పెహల్గామ్ దాడిపై సోషల్ మీడియాలో పోస్టులు.. నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు..
దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు;
జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ పై.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె పలు పోస్టులు చేసింది. వాటిల్లో ఆమె ఓ మత వర్గాన్ని టార్గెట్ చేసింది. దీంతో ఆమెపై ఫిర్యాదు నమోదు అయ్యింది. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆ సింగర్‌పై కేసు పెట్టారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందని, మత ఘర్షణలు ప్రోత్రహించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
నేహా సింగ్ రాథోడ్ ఓ పొలిటికల్ సెటైరిస్ట్. జానపద గాయని కూడా. భోజ్‌పురి పాటలు ఆమె పాడుతుంది. 1997లో పుట్టిందామె. బీహార్‌లోని జన్‌దాలో పెరిగింది. 2018లో ఆమె కాన్పూర్ వర్సిటీ నుంచి బిఎస్సీ పట్టా పొందింది. 2019లో బోజ్‌పురి పాటలు పాడడం స్టార్ట్ చేసింది. మొబైల్ ఫోన్‌లో రికార్డింగ్ చేసేది. వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేది. భోజ్‌పురి కవులు బికారి థాకూరి, మహేందర్ మిస్రిలు తనకు ఇన్స్‌పిరేషన్ అని చెబుతోంది.
2020 మే నెలలో ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. కోవిడ్19 గురించి అప్పుడు హైలెట్ చేసిందామె. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లో తన వీడియోలు షేర్ చేసింది. అక్టోబర్ 2020 నాటికి రాజకీయ విమర్శకురాలిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛానల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్లు వచ్చేశారు. బీహార్ మే కాబా, యూపీ మే కా బీ, యూపీ మే కాబా సీజన్ 2, ఎంపీ మే కాబా పాటలు పాడిందామె. అవన్నీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. 2023 జూలైలో ఆమె వివాదంలో ఇరుక్కున్నది. ఓ గిరిజన కార్మికుడిపై మూత్రం పోసిన వీడియోతో ఆమె మధ్యప్రదేశ్‌లోనూ పాపులరైంది. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద ప్రస్తుతం నేహ సింగ్‌పై కేసు బుక్ చేశారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు.