Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్‌కు జైలు
అత్యాచారం కేసు: నేపాల్ క్రికెటర్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష
నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానె జైలుపాలయ్యాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో లమిచానెను దోషిగా తేల్చిన నేపాల్ కోర్టు.. అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఖరారుచేసింది. 2022 ఆగస్టులో లమిచానె.. ఖాట్మాండులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డట్టు కేసు నమోదుకాగా సుమారు ఏడాదిన్నర విచారణ తర్వాత కోర్టు అతడిని దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు షిషిర్ రాజ్ దకల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
2022 ఆగస్టులో కాఠ్మాండ్‌లోని ఓ హోటల్ గదిలో 17 ఏండ్ల యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడని అతడిపై ఆరోపణలు నమోదయ్యాయి. అదే ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చుతూ కాఠ్మాండ్ జిల్లా కోర్టు గత ఏడాది డిసెంబర్‌లో తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ అతడు ద పాటన్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడా అతడికి చుక్కెదురైంది. దీంతో న్యాయస్థానం తాజాగా శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
2018 వరకూ ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన లమిచానె ఆ తర్వాత నేపాల్‌కు వలసవెళ్లాడు. బిగ్‌బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లలోనూ ఆడాడు. వన్డేలలో అత్యంత వేగంగా 50వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. నేపాల్ తరఫున 51వన్డేలు, 52టి20లు ఆడిన లమిచానె.. వన్డేలలో112 వికెట్లు, టీ20లలో 98 వికెట్లు పడగొట్టాడు. నేపాల్ జట్టుకు సారథిగానూ వ్యవహరించాడు.