Nikki haley: భారత్‌పై ట్రంప్ సుంకాల పెంపు వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిక్కీ హెలీ..
చైనా వంటి శత్రువుకు మినహాయింపులు ఇవ్వొద్దు అని ట్వీట్;
అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ మరోసారి భారత పక్షాన గళం విప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించబోయే టారిఫ్ బెదిరింపులపై ఆమె స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. భారత్ వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలి. చైనా వంటి శత్రువుకు మినహాయింపులు ఇవ్వొద్దు అని ట్వీట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున, భారత్‌పై దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) భారీగా పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హేలీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత్‌కి రష్యా నుంచి చమురు కొనొద్దని నేను అంటున్నాను. కానీ చైనా, ఒక శత్రు దేశం. రష్యా, ఇరాన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం. ఆ దేశానికి మాత్రం 90 రోజుల టారిఫ్ మినహాయింపు ఇవ్వడం ఎలా న్యాయసమ్మతం? అంటూ ఆమె ప్రశ్నించారు.
చైనాకు అమెరికా 90 రోజుల టారిఫ్ విరామాన్ని మేలో ప్రకటించింది. దీనితో టారిఫ్‌లు 145% నుంచి 30%కి, చైనా విధించే సుంకాలు 125% నుంచి 10%కి తగ్గించబడ్డాయి. కానీ, భారత్‌పై 25% టారిఫ్‌ను పెంచుతామని, రష్యా చమురు కొనుగోలుపై జరిమానాలు విధిస్తామని చెప్పారు. హేలీ ఈ విభిన్న ధోరణిని ఖండించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ, మిత్ర దేశమైన భారత్‌ను బెదిరించడం అన్యాయం అంటూ ఆమె స్పష్టం చేశారు.