Nirmala Sitharaman : కేసీఆర్ దేశానికి సేవచేస్తానంటే.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు : నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman : తెలంగాణ పోయింది.. ఇప్పుడు తెలుగు కూడా పోయిందని ఎద్దేవా చేశారు;

Update: 2022-10-08 15:30 GMT

Nirmala Sitharaman : సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను.. భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చారారని... పార్టీకి తెలుగు పేరు కాకుండా సంస్కృతం పేరు పెట్టారని విమర్శించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. తెలంగాణ పోయింది.. ఇప్పుడు తెలుగు కూడా పోయిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ తాంత్రికుల మాట వింటారని, వాళ్లు చెప్పడం వల్లే.. ఇప్పటివరకు సచివాలయానికి వెళ్లలేదన్నారు.

తెలంగాణ ప్రజలకు ఏమీ చేయని కేసీఆర్‌.. దేశానికి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెచ్చిన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌... . 2018 వరకు ఒక్క మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పించలేదన్నారు.

Tags:    

Similar News