Nirmala Sitharaman : స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

Update: 2025-03-14 06:45 GMT

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్‌ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొంత రూపీ సింబల్ అంటున్నారని, రానురాను సొంత మిలిటరీ, సొంత దేశం అని కూడా అనొచ్చని చెబుతున్నారు. కేంద్రంతో వివాదం ఉంటే దేశం మొత్తానికి వర్తించే రూపీ సింబల్ మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపీ(₹) గుర్తును తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.

Tags:    

Similar News